మాయ నుంచి తప్పించగల శక్తి యోగ

అద్దంలో ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. పదేళ్ళ కిందట మీరు తీయించుకున్న ఫోటోతో దాన్ని పోల్చి చూసుకోండి. ఆ ఫోటోను, ఇరవై ఏళ్ళ కిందట మీరు తీసుకున్న ఫోటోతో పోల్చండి. ఇప్పుడు మీరు పదేళ్ళ తర్వాత ఎలా ఉండబోతున్నారో ఊహించుకోండి. మీరు ఎలా ఉంటారు? ఆ ఆలోచన మిమ్మల్ని భయపెడుతుందా? ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే, మీ శ్వాసను లెక్కించండి.

ఒకవేళ నిమిషానికి పదిసార్ల కన్నా తక్కువ ఉంటే, మూడు చిత్రాల మధ్య తేడా స్వల్పంగా ఉంటుంది. మీరు యోగలో ఉన్నారు. తదుపరి వ్యాసాన్ని విస్మరించండి.

ఒకవేళ శ్వాస తీసుకోవడం ఎక్కువగా ఉంటే, మీ ముఖం వృద్ధాప్య లక్షణాలను ప్రదర్శించడమే కాక, మీలో ఉన్న అనేకానే వ్యాధులకు మీరు రకరకాల మందులు వాడుతున్నారన్న మాట. మీ వయసు ఇప్పుడు ఎంతైనా సరే, మీరు జాగృతమై, యోగలోకి ప్రవేశించాలి.

యోగ అంటే చెట్ల చుట్టూ పరిగెడుతూ నాట్యం చేయడం, క్లిష్టమైన భంగిమలను చేయడం లేక జంతువులలాగా శ్వాసను వేగంగా పీల్చడం కాదు. అవన్నీ కూడా వ్యాయామం చేస్తున్న జిమ్నాస్ట్‌ లక్షణాలు, యోగివి కాదు. యోగికి తన శరీరం, అవయవాలపై నియంత్రణ ఉంటుంది, నిదానంగా, లయబద్ధంగా ఊపిరి పీలుస్తాడు, పరమవృద్ధుడు అయ్యే వరకూ కూడా తేజస్సును, వెలుగును కలిగి ఉండటమే కాదు, తన ఇంద్రియాలపై నియంత్రణను కలిగి ఉంటాడు. యోగి ఇంద్రియాలను, దానితో వచ్చే సుఖాలను త్యజించడు. వాటిని అధిగమించి ఉన్నతమైన సుఖాల కోసం వెడతాడు. ఎందుకంటే యోగ అనేది సమస్త సృష్టికి సంబంధించిన శాస్త్రం, అది ప్రపంచానికి, దాని ఆవల ఉన్నదానికి ద్వారం. అది ఇంద్రియాల అనుభవం, ఉన్నతమైన ఇంద్రియాల లోతైన సుఖంలోకి ప్రవేశించడం. యోగలో ఆహార నియమాలు, కర్మకాండలు, జీవనశైలులు ఉండవు. యోగ మీకు స్వేచ్ఛను ఇస్తుంది.

సరైన పద్ధతిలో యోగను సాధన చేస్తున్న వారు అతీంద్రియ శక్తులను అభివృద్ధి చేసుకోవడమేగాక, తేజస్సుతో, రోగరహిత శరీరాన్ని కలిగి ఉంటారు. సనాతన క్రియ సాధకుల గురించి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ప్రముఖ వైద్యులు అన్న మాటలు..

‘యాంటీ ఏజింగ్‌పై ప్రామాణికమైన, అద్భుతమైన థీసిసే కాదు దాని సంక్లిష్టతలను సరళీకరించారు’ – డా|| కె.కె. సింగ్‌, న్యూరో ఫిజీషియన్‌ (సనాతన క్రియ పద్ధతులపై)

‘వ్యక్తుల ఫోటోలను చూసి వారి రోగలక్షణాలను మీరు (ధ్యాన్‌ ఆశ్రమ్‌లోని సాధకులు) గుర్తించగలిగారు’- ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ( సనాతన క్రియ సాధకుల ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షించిన అనంతరం).

(యోగి అశ్విని ధ్యాన్‌ ఫౌండేషన్‌ ఆధ్యాత్మిక మార్గదర్శి, అధిపతి.)