స్థూలకాయాన్ని (ఒబేసిటీ) ఎదిరించండి

స్థూలకాయాన్ని (ఒబేసిటీ) ఎదిరించండి మానవ శరీరం పలు కణజాల సముదాయం. వివిధద అమరికలతో కూడిన ఈ కణ సముదాయం ఒక భిన్న వ్యవస్థగా ఏర్పడి అనుకూల, ప్రతికూల ్పభావాలను కలుగజేసి చివిరికి శరీరం మొత్తంపై ప్రభావం చూపుతుంది.

obesity

వయసుతో నిమిత్తం లేకుండా నేడు ప్రతి వారిని ఇబ్బంది పెట్టే సమస్య బరువునుతగ్గించుకోవాల్సి వారడం. ఇందుకోసం అధిక బరువు ఉన్న వారంతా భ్రమలో పడి పేవేవో తినడం, లైపోసక్షన్‌, ఎక్వుగా వర్కవుట్లు చేయడం, ఇతరత్రా శరీరానికి హాని కలిగించే పరిష్కారాలు, ధెరపీలు అంటూ పాకులాడుతున్నారు. అయితే ప్రతీ ఒక్కరూవొక విషయాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది.అధిక బరువు(ఒబేసిటీ) అన్నది అతిగా తినడం వల్లో అనారోగ్య జీవన విధానవల్లనో మాత్రమేవచ్చేది కాదు. భావోద్వేగాలు, ఒత్తిళ్ళు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.

మన శరీరంలో ఉన్న అధిక దోషాల ఆధౄరంగా వివిధ రూపాల్లో ఈ సమస్య వస్తుందని ఆయుర్వేదంలో స్పష్టంగా గుర్తించారు. సమస్యకు మూలకారణాన్ని కనుగొని దాన్ని తొలగించకుండా కొన&ఇన నిర్దేసిత మూలికలు, ఆసనాలు, ఆహారంలో మార్పులు వంటి ప్రయత్నాలన్నీ పైపైన శరీరానికికి ఉపకరించేవే గానీ పూర్తి రిష్కారం కాదు.

ఇక్కడ నేను రాసిన ‘సనాతన క్రియ- యోగా సారాంశం(ఎసెన్స్‌ ఆఫ్‌ యోగా)’ పుస్తకంలోని కొన్ని విషయాల వివరిస్తాను. శరీరంలోని ప్రధాన భౄగం మొదలు ఇతర భౄగాలన్నింటి పై పనిచేస్తూ నాడీ ప్రవాహంలో కలిగే ఆటంకాలు, అడ్డంకులుఅన్నింటిని శరీర మూలం నుంచి తొలగించే ప్రభౄవవంతమైన ప్రాణాయామం గురించి వివరిస్తీను. ఒబేసిటీ సమస్య కూడా శరీరంలోఅసమతుల్యత వల్ల వచ్చేదే.

– నిటారుగా కూర్చోండి.కనులు మూఉకుని ననాసికా పుటల నుంచి శ్వాస క్రమబ్దదంగాసద ఉండేలా చూసుకోండి.

– నాభిపై దృష్టి సారించి లోపలికి ఊపిరి పీలుస్తూ పొట్టనుగాలితో నింపండి. ఊపిరి బయటికి వదులుతూ పొట్టను ఖాళీ చేయండి( గాలిని వదలడం) ఈ క్రియలో ఎక్కువ సేపు గాలిని పీల్చడం, ఎక్కువ సేపు నల్పి ఉంచడం చేయాలి. దీనిని ‘అబ్డామినల్‌ బ్రీతింగ్‌’ అంటారు.

– ఈ విధౄనం నఅనుకూలంగా ఉన్నట్టయితే ఎక్కువ శ్వౄస పీల్చుకుని తిరిగి వదిలేప్పుడు నోటిని తెరుస్తూ పొట్టలో ఉన్న గాలిని బయటికి పంపడం ద్వారా ఒక నిట్టూర్పు లాంటి ఉపశమనం ఏర్పడుతుంది.ఈ ప్రక్రియను జాగ్రత్తగాద చేస్తే ఒక సన్నని ధ్వనితోగొంతు లోపలి భౄగాలను తాకుతూ గాలి బయటికి వెళ్ళడానిన గుర్తిస్తారు.

– ఇప్పుడు నోటిని మూసి ఇదే ప్రక్రియను అనుసరించడంది. ముక్కు ద్వారా కాకుండా సన్నని ధ్వనితో గొంతు ద్వారా గాలి బయటికి వస్తున్నట్టు భావన పొందండి.

– పొత్తికడుపు పై దృష్టి సారిస్తూ ఒక ముమ్మర ధ్వనితో గొంతు ద్వారా గాలి ప్రయాణిస్తున్న విషయాన్ని గమనిస్తూ మెల్లమెల్లగా ఈ ‘అబ్డామినల్‌ ఇన్‌హేలేషన్‌’ను ప్రాక్టీస్‌ చేయండి.

– నోటిని మూసి ఈ మార్పు ద్వారా ‘అబ్డామినల్‌ బ్రీతింగ్‌’ను కొనసాగించండి.

– ఐదుసార్లు ఇలాగ చేస్తూ ..అంటే దానిని 10 సార్లకు పెంచండి. ఆ తర్వాత 5-10 నిమిషాలు క్రమంగా పెంచుకుంటూ వెళ్ళండి.

సరైన మార్గంలో శ్వాస పీలిస్తే దాని ప్రభావం నేరుగా మన ఆరోగ్యం పైన, మనుగడ పైన చూపుతుంది.

ఈ శ్వాాస ప్రక్రియ సందర్భంగా ఎంతో శక్తి కలుగుతుంది. అయితే అదే సమయంలో ‘ఆమ’ రూపంలో విషతుల్యాలు కూడా ఏర్పడుతాయి. ఈ విష పదార్ధాలు కణజాలాన్ని తినేస్తూ వృద్ధాప్య ఛాయలుతో పాటు శరీరంలోని సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. శ్వాస ఎంత వేగంగా ఉంటుందో విషపదార్ధాల ఉత్పత్తి కూడా అలాగే ఉంటూ కణాజాలాన్ని నిర్వీర్యపరుస్తుంది.

ఉజ్జయ్‌ ప్రాణాయామ :

శరీరంలోని విష పదార్ధాలను తొలగించి, శుద్ధి చేసి శరీరాన్ని పూర్తి సమతుల్యతగా ఉంచే టెక్నిక్‌ ఈ ప్రాణాయాయ. విషతుల్యాలు మాడిపోయేలా ఉష్ణోగ్రతలను పెంచి అదే సమయంలో చల్లబరుస్తూ పూర్తిగా సమతులాన్ని(బ్యాలెన్స్‌) కలిగించడం ఈ టెక్నిక్‌ ప్రత్యేకత. ఈ ప్రాణాయామ ప్రభౄవం, ఫలితం ఇప్పటికప్పుడు వెంటనే కనబడవు. ఈ ఫలితాలు పూర్తిగా కనబడేందుకు రెండు నెలలు పడుతుంది.

వేద శాస్త్రాలపై సాధికారత గల యోగి అశ్విని ధ్యాన ఫౌండేషన్‌కు మార్గదర్శి. యాంటీ ఏజింగ్‌ పై ఆయన రాసిన సిద్ధాంత గ్రంధం ‘ సనాతన క్రియ, ది ఏజ్‌లెస్‌ డైమన్షన్‌’ ఎన్నో ప్రశంసలు అందుకుంది. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ధ్యాన్‌ఫౌండేషన్‌.కాం కు లాగ్‌ ఆన్‌ అవండి లేదా మరిన్ని వివరాలకు ధ్యాన్‌ ఎట్‌ది రేట్‌ ఆఫ్‌ధ్యాన్‌ఫౌండేషన్‌.కామ్‌ కు మెయిల్‌ చేయండి.