ఆయుర్వేదం – Dhyan Foundation

అధర్వణ వేద ఉపాంగం ఆయుర్వేదం
నాలుగు వేదాలైన ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణవేదం సమకూర్చిన విజ్ఞానం గొప్ప జీవనదులతో సమానమైనది. సృష్టికి సంబంధించిన అన్ని అంశాలూ నాలుగు వేదాలలో పొందుపచబడి ఉన్నాయి. ఈ నాలుగు ”మహానదు”లలోను ఒకటైన అధర్వణ వేదానికి ఉపనదిగా ఆయుర్వేదం నిలిచింది. సృష్టి మొదలైన తర్వాతి తక్షణ యుగాలలో వేదాలు గ్రంథస్తం కాలేదు. ద్వాపర యుగంలో మాత్రం వ్యాసమహర్షి వేద విజ్ఞానాన్ని గ్రంథస్తం చేశారు. అంతకు ముందు యుగాలలో వేదాలు ష్రోత్రాల రూపంలో ఉండేవి. గురు పరంపరలో భాగంగా ఈ విజ్ఞానం శిష్యులకు మౌఖికంగా అందేది. అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని లేదా
జీవశాస్త్రాన్ని బ్రహ్మదేవుడు దక్షప్రజాపతికి అందజేసినప్పుడు భౌతిక ప్రపంచంలో రోగాలు, రొష్ఠులు ఉండేవి కాదు. గడచిన యుగాలలో స్వచ్ఛత అన్నది ఆ
స్థాయిలో ఉండేది. ఒకవేళ రోగాలు రొష్ఠులు ఏవైనా ఉన్నప్పటికీ అవి పర్యావరణ పరిశుద్ధత రీత్యా వాటి ఉనికి బయట పడేది కాదు. యుగాలు గడుస్తున్నకొద్దీ
వైపరీత్యాలు, రోగాలు, పెరుగుతూ వచ్చాయి. పర్యావరణ పరిస్థితులలో మార్పులు ఇందుకు కారణం. ప్రజల ఆలోచనలు ఆచరణ పద్ధతులు కూడా ఇందుకు దోహదపడ్డాయి.
స్వచ్ఛతకు పరాకాష్ఠ సత్యయుగం – అంటే స్వార్థం లేకపోవడం, ఒక్క మానవజాతి
గురించే కాక యావత్‌ సృష్టి పట్ల శ్రద్ధ చూపే పరిస్థితులు నెలకొని
ఉండటాన్ని సత్యయుగం అనవచ్చు.
ఆ కాలంలో రోగాలు లేనప్పటికీ ప్రాణశాస్త్ర పరిజ్ఞానం గురించి అప్పటి ఋషులు ayurveda_2
ఆ దైవాన్ని ప్రార్థించటం జరిగింది. బ్రహ్మదేవుడు ఆయుర్వేదాన్ని స్వయంగా
వెల్లడించాడు. ప్రపధమంగా ఆయుర్వేద సూత్రాలను దక్షప్రజాపతికి బ్రహ్మదేవుడు
చెప్పాడు. దక్షప్రజాపతి ఆయుర్వేదం గురించి అశ్వినీ దేవతలకు తెలియపరిచాడు.
అశ్వినీ దేవతలు ఈ ఆయుర్వేద సూత్రాలను ఇంద్రునికి అప్పగించారు. అప్పటివరకు
ఆయుర్వేదం స్వర్గానికి మాత్రమే పరిమితమయి ఉన్నది. సత్యయుగం సమయంలో నాటికి
ఆంగీరసుడు, వశిష్ఠుడు, కాశ్యప, భ్రృగు, ఆత్రేయ, గౌతమ, భరద్వాజ, అగస్త్య,
విశ్వామిత్ర, చ్యవన మొదలైన మహర్షులు, రానున్న కాలల్లో రోగాలు మనుషులపై
విరుచుకుపడగలవని ఊహించి ఈ అంశంపై చర్చించేందుకు హిమాలయాల వద్ద సమావేశమైయ్యారు. ఆ సమావేశంలో ప్రతి ఒక్క ప్రాణి ప్రయోజనం కోసం ఆయుర్వేద విజ్ఞానాన్ని తెలుసుకు వచ్చేందుకు భరద్వాజ మహర్షిని ఇంద్రుడు దగ్గరికి పంపాలని తీర్మానించారు. భరద్వాజ మహర్షికి రోగ లక్షణాల శాస్త్రాన్ని,
రోగనిరోధక పద్ధతులను ఇంద్రుడు సూచించడం జరిగింది. శరీరం క్రమంగా శుష్కించి పోవడం అన్నది సహజమైన ధర్మం. రోగాలు మనుషులపై విరుచుపడే
పరిస్థితి దాపురించ టంతో శరీరం శుష్కించి పోయే క్రమం వేగిరమైంది. ఈ వేగాన్ని తగ్గించేందుకు శుష్కించి పోవడాన్ని అదుపుచేసి ఒక రకమైన సమతుల్యత
సాధించేందుకు యోగా, ఆయుర్వేదం ఉపయోగపడతాయని తెలుసుకొన్నారు.
రోగాలను రెండు విధాలుగా వర్గీకరించారు. అవి మానసిక రుగ్మత, శారీరక
రుగ్మత. శారీరక రుగ్మతలకు వాతం, పిత్తం, కఫం ప్రధాన కారణాలు అని
గుర్తించటం జరిగింది. ఈ మూడు దోషాల మధ్య సమతుల్యత కొన సాగ డాన్ని
ఆరోగ్యంగాను, సమతుల్యత లోపించటాన్ని రోగంగాను పరిగణించారు. ఇక మానసిక
రోగం విషయాని కొస్తే రజస్‌, తమస్‌గా గుర్తించారు. వీటికి మానసిక మైన
ప్రాధాన్యత ఉంది. అయితే ఇవి యోగసాధన వల్ల అదుపులో ఉండగలవని భావించారు.
శారీరక దోషాలలో అంటే త్రిదోషాలలో వాతానికి అత్యధిక ప్రాముఖ్యత ఉంది.
వాతము అంటే వాయు అని అర్థం. రకరకాల రోగాలు, రోగ తీవ్రత దీనిపైనే ఆధారపడి
ఉంటాయి. అంతేకాక శారీరక సమతుల్యతను భగ్నం చేసే గుణం కూడా వాతానికి ఉంది.
త్రిదోషాలలోను వాతానికి మాత్రమే చలన స్థితి ఉండటం ఇందుకు కారణం. పిత్తం
అరుగుదలకి సంబంధించింది. మూడవ దైన కఫంవల్ల సంక్రమించే అనారోగ్యం
పైరెండిటితో పోలిస్తే చాలా తక్కువ. వాతం వల్ల ఎనభై రకాల రోగాలు
సంప్రాప్తించే అవకాశాలు ఉండగా పిత్తం వల్ల నలభై రకాలు, కఫం వల్ల 20 రకాల
రోగాలు సంభవించే అవకాశాలు న్నాయి. ఈ మూడు దోషాలలో ఏదైనా పెరగడం, లేదా
తరగడం సంభవించినప్పుడు రోగాలక్షణాలు బయటపడతాయి. ఆయా వ్యక్తుల ప్రకృతి
ఆధారంగా త్రిదోషాల సమతుల్యతకు సంబంధించి ఒకరికి మరొకరికి మధ్య
వ్యత్యాసాలు ఉంటాయి.
ఉదాహరణకు: పిత్తంతో బాధపడేవారికి అల్లం విషతుల్యమైనది. ఇతరులకు అదే అల్లం
అరుగుదలకు సంబంధించి టానిక్‌ మాదిరి పనిచేస్తుంది. ప్రకృతి సమతు ల్యంగా
ఉండాలని, వికృతి రోగానికి దారి తీయగలదని ఆయుర్వేదం చెపుతుంది. ఇవాళ రేపు
ఆయుర్వేదం మందు అని చెపితే చాలు బ్రహ్మాండంగా అమ్ముడు పోతున్నాయి. అర్థం
చేసుకోవలసింది ఏమింటంటే అప్పటికప్పుడు రోగాన్ని తగ్గించి వేసే లక్షణం
ఆయుర్వేదానికి లేదు. క్రమంగా కొద్దికాలం వైద్యాన్ని అందుకున్న తరు వాత
రోగానికి సంబంధించిన మూల కారణాలను గమనించి మార్పు చేసే విధంగా ఈ వైద్యం
పనిచేస్తుంది. అంటే రోగం వల్ల శరీరంలో ఏర్పడే అసమ తుల్యతను మాయం చేసి
సమతుల్యతను చేకూరుస్తుంది.
ఈ దుృష్ట్యా ఆయుర్వేదం అన్నది రోగాన్ని నయం చేసేందుకు కాదనీ, శరీరంలోని
రోగలక్షణాల అసమతుల్య తను తొలగించి సమతుల్యత చేకూర్చేది అని చెప్పటం
సముచితంగా ఉంటుంది
www.ధ్యాన్ ఫౌండేషన్ .com న మమ్మల్ని సంప్రదించండి
యోగి అశ్వినీ ధ్యాన్ ఫౌండేషన్